Saturday, December 21, 2024

కొత్త స్థానాల్లో విధుల్లోకి టీచర్లు

- Advertisement -
- Advertisement -

శుక్రవారం సాయంత్రం కల్లా 21,800 మంది రిపోర్టు
జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల కేటాయింపు పూర్తి
కొత్త పోస్టింగ్‌లలో 13,760మంది ఇతర జిల్లా కేడర్ ఉద్యోగులు

Teachers joined in new schools

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 మేరకు రాష్ట్రంలోని అన్ని జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల కేటాయింపు పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు 22,418 మంది ఉపాధ్యాయుల్లో 21,800 మంది వారి కొత్త స్థానాల్లో చేరారు. ఇప్పటికే 13,760 మంది ఇతర జిల్లా కేడర్ ఉద్యోగులు తమ కొత్త పోస్టింగ్‌లలో చేరారు. ఈ భారీ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వ్యవధిలో పూర్తి చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పారదర్శకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, విభాగాధిపతులు, అధికారులకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్తర్వుల అమలుతో స్థానిక యువతకు 95 శాతం రిజర్వేషన్‌తో ఉపాధి అవకాశాలను కలుగుతాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News