Thursday, December 19, 2024

బడి పంతుళ్లు బయట.. మా పిల్లల భవిష్యత్ ఏంటి?

- Advertisement -
- Advertisement -

బడికి వచ్చినట్లే వచ్చి పిల్లలకు పాఠాలు
చెప్పకుండా బయటే తిరుగుతున్న బడి పంతులు
ఆందోళనలో తల్లిదండ్రులు

 

మన తెలంగాణ/తిరుమలాయపాలెం : తిరుమాలయపాలెం మండలం పైనంపల్లి ఆమ్లెట్ ఆఫ్ హాల్ తండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 25 నుండి 30 మంది విద్యార్ధినీ విద్యార్ధులున్నారు.. అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు సీహెచ్. శశిధర్ అను ఇతను పాఠశాలకు హాజరై విద్యార్ధినీ విద్యార్ధులకు పాఠాలు బోధించాల్సిన వీరు బడిని, బడి పిల్లలను వదిలేసి బడికి వచ్చినట్లుగా హాజరు రిజిస్టర్‌లో సంతకం పెట్టి, విలాసాల కొరకు కులాసాగా స్నేహితులతో సూర్యాపేట జిల్లా మోతే మండలం, నరసింహాపురం గ్రామంలో విలాసాలలో పాల్గొనుటకు వెళుతున్న ఉపాధ్యాయుడిని పైనంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ దారావత్ శ్రీను నాయక్ చూసి మీరు బడి వదిలిపెట్టి ఇక్కడేం చేస్తున్నారని మందలించి మీరు తక్షణమే బడికి వెళ్ళి పిల్లలకు పాఠశాలు చెప్పుకోండని మందలించినా రాకపోయే సరికి స్థానికంగా ఉన్నటువంటి పైనంపల్లి గ్రామానికి చెందిన ఎంపిటిసి దారావత్ శంకర్ నాయక్‌కి విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేయగా అతను వెళ్ళి బడి పంతులు అయినటువంటి శశిధర్‌ని పట్టుకుని వచ్చి పిల్లలకు పాఠాలు ఎవరు చెప్పాలి..

పిల్లల భవిష్యత్తు ఏమిటని నిలదీశారు. ఇట్టి విషయం గత సంవత్సరం నుండి కూడా ఇతను చేయబట్టే ఆ స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉండేవారు. ఒక టీచర్‌ను పంపించడం జరిగింది. ఆ గ్రామంలో కూడా ఇతను చేయబట్టే చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇతను విద్యాబోధన బోధించేది పోయి విలాసాలకు అలవాటై విలాసవంతంగా తిరగడం వలన పిల్లలు అక్షరాలు నేర్చుకోలేని పరిస్థితి ఉందని ఆ గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి బాగోలేక ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేక గవర్నమెంట్ బడికి పంపిస్తున్నారు.

ఇలా పంపిస్తున్న వారి పిల్లలకు ఉపాధ్యాయుడు సీహెయ్. శశిధర్ సమయానుకూలంగా రాకపోవడం వచ్చినా బడిలో ఉండకుండా బయటికి పోయి తిరిగి రావడం వలన మా పిల్లలకి అక్షరం ముక్క కూడా రావటం లేదని తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఎంతటి వారలైన గరవ్నమెంట్ స్కూళ్ళలోనే వారి వారి పిల్లలను చేర్పించానలి అలా చేర్పించిన పిల్లలకు విద్యాబోధన మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఉపాధ్యాయుడికి జీతభత్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా పెంచి ఇస్తున్నా విద్యార్ధిని విద్యార్ధుల చదువుల పట్ల ఉపాధ్యాయులు ఆసక్తి చూపటం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి తక్షణమే ఇలాంటి ఉపాధ్యాయులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుని మరి ఏ ఉపాధ్యాయుడు కూడా ఇలా చేయకుండా వారిపై నిఘా ఏర్పాటు చేసి విద్యార్ధినీ విద్యార్దులకు మంచి విద్యను అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, ప్రజలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News