Monday, January 20, 2025

విద్యార్థుల నైపుణ్యతలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: విద్యార్థుల నైపుణ్యతలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలనే కసితో విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ చదువుకుని అనుకున్న గమ్యస్థానాలను చేరుకోవాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం అచ్చంపేట మండల పరిధిలోని ఐనోల్ గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ప్రభుత్వ విప్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో ఎమ్మెల్యే రెండు గంటల పాటు ముఖాముఖిగా మాట్లాడి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి చదువులపై శ్రద్ధ వహించినట్లైతే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని గుర్తు చేశారు. చదువుకుంటే దేనినైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసం విద్యార్థులకు కల్పించారు.

ఎంతో ఆశతో మీ తల్లిదండ్రులు హాస్టళ్లకు పంపించి పిల్లలు గొప్ప ప్రయోజకులు కావాలని నమ్మకంతో ఉండడం పట్ల వారి ఆశయాలను నెరవేర్చేందుకు విద్యార్థి దశలోనే చదువుపై ప్రతి ఒక్కరు మక్కువ చూపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు కడుపునిండా మూడు పూటల అన్నం పెడుతూ నాణ్యమైన విద్య బోధన అందిస్తున్నారని విద్యార్థినిలకు సూచించారు.

ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్లలో మెరుగైన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు మంచి చదువు అందే విధంగా ముందుకు వెళ్తున్న సిఎం కెసిఆర్‌కు కృతఙ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన కాస్మోటిక్స్ వంటివన్ని అందిస్తున్నారని తెలిపారు. ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు దాసరి మల్లయ్య, నాయకులు రాజేష్ రెడ్డి, రమేష్ రావు, భగవత్ గౌడ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News