Thursday, December 19, 2024

అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడటం లేదని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో గెస్ట్ లెక్చరర్స్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అరెస్టు చేసిన గెస్ట్ లెక్చరర్స్‌ను తక్షణమే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా అధ్యాపకులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పదేళ్ల నుంచి గెస్ట్ లెక్చరర్స్‌గా పని చేస్తున్న తమను రెన్యువల్ చేయాలని వారు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పును కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. సెలవులు వస్తే వారికి జీతాలు రావు. వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని ఈటల కోరారు. గెస్ట్ లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వారిలో ఇంటర్ బోర్డులో 1654 మంది, డిగ్రీ కళాశాలలో 1940 మంది,మోడల్ స్కూల్స్‌లో 1250 మంది, కెజిబివిల్లో 1350 మంది, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలో 9600 మందితో కలిపి మొత్తంగా 15794 మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారని గుర్తుచేశారు. విఆర్‌ఎలు సమ్మె చేస్తే ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు విఆర్‌ఎ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్య పరిష్కారం కాలేదన్నారు.
దేవుడు కరుణిస్తే.. భూగర్భ జలాలు పెరిగాయి
కాళేశ్వరం కట్టిన డబ్బులు వెనక్కు వచ్చాయి అని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల పేరుతో 16200 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్ట్ ను వారే 34 వేల కోట్లు చేశారు. కెసిఆర్ వచ్చాక దాన్ని 84 వేల కోట్లు.. లక్ష కోట్లు చేశారు. కాళేశ్వరం వల్ల ఒరిగింది ఏమీ లేదు. దేవుడు కరుణించి మంచి వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగాయి తప్ప కాళేశ్వరం వల్ల కాదు. ఇది పచ్చి అబద్దం. వారి లెక్కల ప్రకారం కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 155 టిఎంసిల నీటిని ఎత్తిపోశారు. 1 టిఎంసీ 10 వేల ఎకరాలు చొప్పున 150 టిఎంసిల నీటితో రూ.600 కోట్ల పంట పండి ఉంచవచ్చు. కానీ మొత్తం డబ్బు వాపస్ వచ్చింది అంటే వినడానికి ఎడ్డోల్లామా? అంత అమాయకుల లెక్క కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News