Wednesday, November 13, 2024

ఉపాధ్యాయులు పరిశోధన ఆధారిత బోధన వ్యుహాలు అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఉపాధ్యాయులు పరిశోధన ఆధారిత బోధనా వ్యూహాలు అమలు చేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగాలని ఉస్మానియా ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొపెసర్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు. మంచి విద్య ఒక విద్యార్థి మంచి పౌరుడిగా ఎదగడానికి, సమాజాభివృద్ధికి దోహదపడేలా దిశానిర్దేశం చేసి బాటలు వేయాలన్నారు. గురువారం సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో లైఫ్ సైన్స్ టీచర్స్ కోసం రీసెర్చ్ బేస్డ్ పెడగోగికల్ టూల్స్ అనే విషయంపై మూడు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించారు.

ఈసందర్బంగా మాట్లాడుతూ బహుళ అభ్యాస వనరుల ఈ యుగంలో, ఉపాధ్యాయుని పని సృజనాత్మకత వనరులను పెంపొందించడానికి విద్యార్థికి బోధనా వ్యూహాలను ఆవిష్కరించాలని పేర్కొన్నారు. అనంతరం ఓయూ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్, ప్రొఫెసర్ సి వి రంజని ప్రసంగిస్తూ విద్యార్థి కెరీర్ లక్ష్యాల పట్ల లోతు అంకితభావం ప్రాముఖ్యతను వివరిస్తూ ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఇటువంటి వర్క్‌షాప్‌ల ప్రాముఖ్యతను తెలిపారు. తమ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని , సాంకేతిక పరిణామాలను నిరంతరం నవీకరించి వారి బోధనా పద్ధతుల్లో వాటిని పొందుపరచాలని పిలుపునిచ్చారు.

కెరీర్‌లో భాగంగా సైన్స్ రంగాన్ని ఎంచుకునేలా విద్యార్థులను ప్రేరేపించేందుకు ఇది చాలా కీలకమన్నారు. అదే విధంగా డాక్టర్ హమీదా బీ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం కలిగించడానికి సమస్యలపై పూర్తి స్పష్టత ఉండాలని విద్యార్థులు శాస్త్రీయ స్వభావం పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించడానికి ఉత్సాహంగా పని చేయాలని కోరారు. ఉపాధ్యాయులు తమ తరగతి గది బోధనా వ్యూహాలను మెరుగుపరచడం ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో నైపుణ్యం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని కళాశాలల నుండి పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News