Monday, December 23, 2024

ఉపాధ్యాయ కుటుంబాలకు భరోసా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః విధి నిర్వహణలో అర్థాంతరంగా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించి స్వాంతన చేకూర్చాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సంక్షేమ నిధి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. నల్లగొండ జిల్లా కార్యాలయం కేంద్రంగా టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే కుటుంబ సంక్షేమ నిధి మే 2వ తేదీన లాంఛనంగా ప్రారంభించబడుతుంది. శుక్రవారం టిఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయాన్ని, తదనంతరం సభ్యత్వాల నమోదును అధికారికంగా ప్రారంభించినున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. టిఎస్ యుటిఎఫ్ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రారంభోత్సవానికి హాజరు కావాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.

ఒక్కరి కోసం అందరూ…అందరి కోసం ప్రతి ఒక్కరూ అనే నినాదంతో పరస్పర సంఘీభావం ప్రాతిపదికన జూన్ 30 లోపు ఈ పథకంలో చేరి జులై 1 తర్వాత మరణించిన టిఎస్ యుటిఎఫ్ సభ్యుల కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందజేయనున్నారు. కనీసం ఐదువేల మందిని సభ్యులుగా చేర్పించి, ప్రతి ఒక్కరి నుండి రు. 100 చొప్పున సంఘీభావ విరాళం వసూలు చేసి మరణించిన సభ్యుని కుటుంబానికి 15 రోజుల్లోగా రు. 5 లక్షలు అందించాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ పథకం నిర్వహణ కోసం జనరల్ కౌన్సిల్, కార్యవర్గం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే మూడు దొంతరల పాలకవర్గం ఎన్నుకోబడుతుంది. సభ్యత్వాలు పూర్తై, ఎన్నికలు జరిగి కుటుంబ సంక్షేమ నిధికి పూర్తి స్థాయి పాలకవర్గం ఏర్పడే వరకు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీనే ఎఫ్‌డబ్లూఎఫ్ రాష్ట్ర కార్యవర్గంగా, రాష్ట్ర ఆఫీసు బేరర్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News