Monday, December 23, 2024

శేఖర్ కమ్ముల మూవీలో ఛాన్స్.. ఆనందంలో రష్మిక

- Advertisement -
- Advertisement -

తమిళ స్టార్ హీరో ధనుష్ తన 51వ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చేస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ క్రేజీ ప్రాజెక్టును తమ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి (ఏషియన్ గ్రూప్)లో అమిగోస్ క్రియేషన్స్  ప్రైవేట్ లిమిటెడ్ తో కలసి నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ను మేకర్స్ వదిలారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రష్మిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఇక, యూనిక్ సబ్జెక్టుతో ఈ మూవీలో ధనుష్ ను సరికొత్త అవతారంలో శేఖర్ కమ్ముల ప్రజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News