Sunday, January 26, 2025

టీమిండియా 307 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు టీమిండియా 103.2 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంకా ఇంగ్లాండ్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. జురెల్ 90 పరుగులు చేసి టామ్ హార్ట్ లే బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఎనిమిదో వికెట్‌పై కుల్దీప్ యాదవ్‌తో కలిసి జురెల్ 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (73), శుబ్‌మన్ గిల్(38), కుల్దీప్ యాదవ్(28), రజత్ పాటీదర్(17), సర్ఫరాజ్ ఖాన్(14), రవీంద్ర జడేజా(12), రోహిత్ శర్మ(2), రవిచంద్రన్ అశ్విన్(01), ఆకాశ్ దీప్(09), మహ్మద్ సిరాజ్ (నాటౌట్) పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ ఐదు వికెట్లు, టామ్ హార్ట్‌లే మూడు వికెట్లు, జేమ్స్ అండర్సన్  రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News