దుబాయి: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన ఆస్ట్రేలియా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ 66.66 శాతంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 55.00 శాతంతో రెండో స్థానానికి పరిమితమైంది. విండీస్ చేతిలో ఓటమి పాలు కావడం ఆస్ట్రేలియాకు ప్రతికూలంగా మారింది.
మరోవైపు ఇంగ్లండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఓటమి టీమిండియాపై కూడా ప్రభావం చూపింది. ఈ ఓటమి ప్రభావం భారత డబ్లూటిసి పాయింట్లపై పడింది. ప్రస్తుతం భారత్ 52.77 శాంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన మూడు టెస్టుల్లో విజయం సాధిస్తేనే భారత్‌కు ఫైనల్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాగా, బంగ్లాదేశ్ నాలుగో, పాకిస్థాన్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.