Thursday, December 26, 2024

టీమిండియా 400 ఆలౌట్…

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 139.3 ఓవర్లలో 400 పరుగులు చేసి ఆలౌటైంది. ఇప్పటికే భారత జట్టు 223 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా 70 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మహ్మాద్ షమీ 37 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్‌లో కారేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్షర పటేల్ 174 బంతుల్లో 84 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మహ్మాద్ సిరాజ్ ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచిడు. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ ఏడు వికెట్లు పడగొట్టగా కమ్నీస్ రెండు వికెట్లు, నాథన్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసి ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News