Monday, December 23, 2024

టీమిండియా 404 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

చట్టోగ్రామ్: జహుర్ అహ్మాద్ చౌదరీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 133.5 ఓవర్లలో 404 పరుగులు చేసి ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ 192 బంతుల్లో 86 పరుగులు చేసి ఏడో వికెట్ రూపంలో ఔటయ్యాడు. రవి చంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఎనిమిదో వికెట్‌పై అశ్విన్- కులదీప్ యాదవ్ 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్ 58 పరుగులు చేసి మిహిడీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో నురుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కుల్దీస్ యాదవ్ 40 పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. సిరాజ్ నాలుగు పరుగులు చేసి మిహిడీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ముస్పీకర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, మిహిడీ హసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీయగా బడాట్ హోస్సేన్ ఖలీద్ అహ్మాద్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News