Thursday, January 23, 2025

టీమిండియా 109 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

 

ఇండోర్: హోల్కర్ స్టేడియంలో బోర్డర్‌ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 33.2 ఓవర్లలో 109 పరుగులు చేసి ఆలౌటైంది. మాథ్యూ కుహ్నెమాన్ బౌలింగ్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. నాథన్ లయాన్, కుహ్నెమాన్ భారత జట్టు వెన్నువిరిచారు.  భారత్ బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ(22), శుభ్‌మన్ గిల్(21), శ్రీకర్ భరత్ (17), ఉమేష్ యాదవ్ (17), రోహిత్ శర్మ(12), అక్షర పటేల్ (12), రవీంద్ర జడేజా(06), రవీచంద్రన్ అశ్విన్(03), ఛటేశ్వరా పుజారా(01) పరుగులు చేసి ఔటయ్యారు. మథ్యాకుహ్నెమాన్ ఐదు వికెట్లు పడగొట్టగా నాథన్ లయాన్ మూడు వికెట్లు, టడ మర్ఫీ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News