ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రికార్డు విజయాన్ని సాధించిన టీమిండియాపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టు క్రికెట్‌కు భారత జట్టు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని కొనియాడాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత నిలకడైన విజయాలు సాధిస్తున్న జట్టుగా భారత్ నిలుస్తుందన్నాడు. దీనికి ఐదారేళ్లుగా టీమిండియా సాధిస్తున్న విజయాలే నిదర్శనమన్నాడు. సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ భారత్ టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందం కలిగించే అంశమన్నాడు. ఒకప్పుడూ ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా తదితర జట్లు ఇలాగే వరుస విజయాలు సాధించేవన్నాడు. ప్రస్తుతం టీమిండియా కూడా ఆ జట్ల మాదిరిగానే ఇంటాబయట వరుస విజయాలతో చెలరేగి పోతుందని రవిశాస్త్రి ప్రశంసించాడు.
ఇక టెస్టు క్రికెట్‌కు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తుందంటే దానికి టీమిండియానే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఇక టెస్టుల్లో భారత్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందన్నాడు. రానున్న సౌతాఫ్రికా సిరీస్‌లో కూడా భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు టీమిండియాలో కొదవలేదన్నాడు. ఇతర జట్లతో పోల్చితే భారత జట్టు మూడు ఫార్మాట్‌లలోనూ చాలా బలంగా ఉందన్నాడు. దీంతో రానున్న రోజుల్లో కూడా టీమిండియా జోరు కొనసాగడం ఖాయమని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు.
Team India Ambassador for Test Cricket: Ravi Shastri