Friday, December 20, 2024

సౌతాఫ్రికా చేరిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

డర్బన్: సౌతాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం టీమిండియా డర్బన్ చేరుకుంది. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో భారత జట్టు దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్లింది. సౌతాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టి20లు, 3 వన్డేలు, మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను బిసిసిఐ ఎంపిక చేసింది. టి20లో సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కెఎల్ రాహుల్ సారథ్యం వహిస్తారు. టెస్టు సిరీస్‌లో రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలను నిర్వర్తిస్తాడు. ఇక ప్రస్తుతం పరిమిత ఓవర్ల టీమ్ సౌతాఫ్రికాకు చేరుకుంది. సిరీస్‌లో భారత్ తొలుత టి20 మ్యాచ్‌లను ఆడనుంది.

దీని కోసం ముందుగా ఈ సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు దక్షిణాఫ్రికాకు బయలుదేరి వచ్చారు. భారత్‌సౌతాఫ్రికా జట్ల మధ్య డర్బర్ వేదికగా ఆదివారం తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ శుక్ర, శనివారాల్లో సాధన చేసే అవకాశం ఉంది. రెండో టి20 మంగళవారం సెయింట్ జార్జెస్ పార్క్‌లో, మూడో టి20 డిసెంబర్ 14న జోహెన్నస్‌బర్గ్‌లో జరుగుతుంది. ఇక డిసెంబర్ 17న జరిగే మ్యాచ్‌తో వన్డే సిరీస్ ఆరంభమవుతోంది. ఈ మ్యాచ్ కూడా జోహెన్నస్‌బర్గ్‌లోనే నిర్వహిస్తున్నారు. రెండో వన్డే 19న సెయింట్‌జార్జెస్ పార్క్‌లో, మూడో వన్డే 21న బొలాండ్ పార్క్‌లో జరుగనుంది. మరోవైపు తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో, రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3నుంచి కేప్‌లో జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News