ముంబై: భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఐపిఎల్‌తో బిజీగా ఉన్నారు. ఈ టోర్నమెంట్ మే 25వ తేదీన ముగుస్తుంది. ఐపిఎల్ జరుగుతున్న సమయంలో తమకు ఇష్టమైన జట్టుకు మద్దతు ఇచ్చే అభిమానులు ఈ టోర్నీ ముగిశాక అందరూ టీం ఇండియాకే సపోర్ట్ ఇస్తారు. అయితే ఈ టోర్నమెంట్ తర్వాత టీం ఇండియా ఇంగ్లండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అక్కడ ఆతిథ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. . అక్కడ మూడు వన్డేలు, మూడు టీ-20లు ఆడనుంది. ఆగస్టు 17న మిర్పూర్‌లో తొలి వన్డే, ఆగస్టు 20న మళ్లీ మిర్పూర్‌లో రెండో వన్డే, ఆగస్టు 27న చట్టోగ్రామ్‌లో మూడో వన్డే ఆడనున్నారు. ఆ తర్వాత మూడు టీ-20ల్లో భారత, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. తొలి టీ-20 ఆగస్టు 26న చట్టోగ్రామ్‌లో, ఆగస్టు 29న మిర్పూర్‌లో, ఆగస్టు 31ను మళ్లీ మిర్పూర్‌లో మ్యాచులు జరుగనున్నాయి.
బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
- Advertisement -
- Advertisement -
- Advertisement -