Wednesday, January 22, 2025

రికార్డులతో పోటీపడిన భారత ఆటగాళ్లు

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించడంతో పలు రికార్డులు నెలకొల్పింది. టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో గెలవడంతో అతి పెద్ద విజయంగా రికార్డు సృష్టించింది. గతంలో దక్షిణాఫ్రికాపై 372 పరుగుల రికార్డు ఉంది. అతిపిన్న వయసులో జైస్వాల్(22 ఏళ్ల 49 రోజులు) రెండు డబుల్ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించగా, గతంలో వినోద్ కాంబ్లి(21 ఏళ్ల 54 రోజులు), బ్రాడ్‌మన్‌లు( 21 ఏళ్ల 318) ముందగా ఉన్నారు. ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ 22 సిక్సర్లు బాది తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాపై 19 సిక్సర్ల రికార్డు ఉంది. జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు బాది వసీం అక్రమ్ రికార్డు సమం చేశాడు.

గతంలో ఒకే సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై భారత 47 సిక్స్‌ల రికార్డును నిన్నటి మ్యాచ్‌తో(48) అధిగమించింది. టెస్టుల్లో వరుసగా మూడు మ్యాచుల్లో 150+ పరుగులు సాధించిన బ్యాటరుగా జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు. మూడు వరుస టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసి వినోద్ కాంబ్లి(1993), విరాట్ కోహ్లీ(217) తరువాత మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్ నుంచి తొలి టెస్టు మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లలో 50 కంటే ఎక్కువ పరుగులు చేసి ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్ నాలుగో స్థానంలో ఉండగా దిలావర్, గావస్కర్, శ్రేయస్ అయ్యర్ ముందుగా ఉన్నారు. స్వదేశంలో తొమ్మిది ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు’ అందుకొని అనిల్ కుంబ్లే రికార్డును రవీంద్ర జడేజా సమం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News