Tuesday, December 24, 2024

ముమ్మర సాధన..

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: భారత్‌ ఇంగ్లండ్ జట్ల మధ్య గురువా రం నుంచి జరిగే మూడో టెస్టు కోసం ఇరు జట్ల ఆటగాళ్లు మంగళవారం ముమ్మర సాధన చేశారు. రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు ప్రస్తుతం 11తో సమంగా ఉన్నాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్, రెం డో టెస్టులో టీమిండియా విజయం సాధించాయి. మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. కాగా, మంగళవారం ఇటు ఇంగ్లండ్ అటు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, సిరాజ్, అశ్విన్, సిరాజ్ తదితరులు ప్రాక్టీస్ చేశారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో సాధన కొనసాగింది. జాతీయ స్థాయిలో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ మూడో టెస్టులో ఆడనున్నాడు. నాలుగో స్థానంలో నుంచి స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్ధుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News