Friday, January 24, 2025

బ్యాటింగ్ చేస్తున్న జురెల్, కుల్దీప్…

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు టీమిండియా 83 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 241 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 112 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (73), శుబ్‌మన్ గిల్(38), రజత్ పాటీదర్(17), సర్ఫరాజ్ ఖాన్(14), రవీంద్ర జడేజా(12), రోహిత్ శర్మ(2), రవిచంద్రన్ అశ్విన్(01) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ జురెల్(40), కుల్దీప్ యాదవ్(25) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు, టామ్ హార్ట్‌లే(02), జేమ్స్ అండర్సన్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News