Sunday, January 19, 2025

తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

రోసో: తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ దిగిన విండీస్ 150 పరగులు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 421/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. భారత బ్యాట్స్ మెన్లలో జైస్వాల్(171), కెప్టెన్ రోహిత్ శర్మ(103), విరాట్ కోహ్లీ(76), రవీంద్ర జడేజా(37 నాటౌట్)లు రాణించారు.

దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ జట్టు కేవలం 130 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బౌలింగ్ లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లతో విండీస్ జట్టును కుప్పకూల్చాడు. తొలి మ్యాచ్ లోనే భారీ సెంచరీతో చెలరేగి రికార్డు సృష్టించిన యశస్వీ జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News