Monday, December 23, 2024

ఐదో టెస్టుకు కెప్టెన్‌గా అశ్విన్?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టు ఆడనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి అశ్విన్‌కు పగ్గాలు అప్పజెప్పనున్నట్టు సమాచారం. 14వ భారత ఆటగాడిగా అశ్విన్ వందో టెస్టు ఆడనున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లలో ఒక టెస్టు మిగిలి ఉండగానే ఈ సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. దీంతో బిసిసిఐ మేనెజ్‌మెంట్ రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వనుంది. ఇప్పటికే స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మకు బదులుగా ఓపెనర్‌గా దేవదూత్ పడిక్కల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అశ్విన్ 99 టెస్టులు ఆడి 507 వికెట్లతో 3309 పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News