Saturday, April 5, 2025

టీమిండియా కోచ్ గా గంభీర్?

- Advertisement -
- Advertisement -

టీమిండియా ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నెలాఖరులోగా దీనిపై భారత క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటనే చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం వరల్డ్‌కప్ తర్వాత ముగియనుంది. మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ ఆసక్తి చూపించలేదు. దీంతో అతని స్థానంలో గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించాలని బిసిసిఐ భావిస్తోంది. కోచ్ పదవీ కోసం భారత్‌తో పాటు విదేశీ క్రికెటర్లు సయితం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గంభీర్‌కే కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో గంభీర్ పర్యవేక్షణలో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News