Saturday, November 23, 2024

ద్రవిడ్‌కు అండగా సెహ్వాగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ డ్రవిడ్‌కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాసటగా నిలిచాడు. జట్టు విజయాల్లో ఆటగాళ్లదే కీలక పాత్రని, కోచ్‌ల మీద ఆదారపడి ఉండదని హితవు పలికాడు. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటిసి ఫైనల్, 2022 టి20 ప్రపంచకప్‌లో ఓటమితో రాహుల్ ద్రవిడ్ విఫలమయ్యాడంటూ వస్తున్న విమర్శలను సెహ్వాగ్ తప్పుబట్టాడు. ఆటగాళ్ల ప్రదర్శనపైనే కోచ్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయని తెలిపాడు.

2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేసిన గ్యారీ కిరిస్టెన్.. అనంతరం చాలా జట్లకు కోచ్‌గా వ్యవహరించినా.. విజేతగా ఫలితం సాధించలేకపోయాడిని పేర్కొన్నాడు. ఐసీసీ నిర్వహించిన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన వీరు ద్రవిడ్‌కు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, మైదానంలోకి దిగిన ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తే కోచ్‌ను అభినందిస్తారు. పేలవ ఆటతో ఓటమిపాలైతే విమర్శిస్తారు. భారత్ డబ్ల్యూటిసి ఫైనల్ చేరింది. కానీ టైటిల్ అందుకోలేకపోయింది. దాంతో ప్రతి ఒక్కరూ పరాజయం గురించే మాట్లాడుతూ కోచ్ ద్రవిడ్ నిందించడం సరికాదు అంటూ  వీరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మెదక్ లో రెండు కంటైనర్లు ఢీ: ఇద్దరు సజీవదహనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News