Thursday, January 23, 2025

మూడు రికార్డులు సృష్టించిన భారత ఆటగాళ్లు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న మూడో ట్వి20లో సూపర్ రెండో ఓవర్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 3-0తో టీమిండియా ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులు చేసి శతకం బాదాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సెంచరీల చేసిన రికార్డు రోహిత్ ఖాతాలో చేరింది. రోహిత్ ఐదు సెంచరీలు చేసి తొలి స్థానంలో ఉండగా మ్యాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్ నాలుగు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను రోహిత్ శర్మ-రింకు సింగ్ గట్టెక్కించారు. ఐదు వికెట్‌పై రోహిత్-రింకు 190 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. కరీంజనత్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో రోహిత్-రింకు 36 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. గతంలో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో యువరాజ్ 36 పరుగులు చేశాడు. అకిల దనంజయ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో కీరన్ పొలార్డ్ 36 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.

టి20లో అత్యధిక భాగస్వామం రికార్డులు

2024లో ఆఫ్ఘానిస్థాన్‌పై రోహిత్-రింకు 190 పరుగులు నాటౌట్
2022లో ఐర్లాండ్‌పై సంజూ శాంసన్-దీపక్ హుడా 176 పరుగులు
2017లో శ్రీలంకపై రోహిత్- రాహుల్ 165 పరుగులు
2023లో వెస్టిండీస్‌పై యశస్వి జైశ్వాల్- శుబ్‌మన్ గిల్ 165 పరుగులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News