Monday, December 23, 2024

రెండో వన్డేలో టీమిండియా ఓటమి

- Advertisement -
- Advertisement -

Team India defeat in 2nd ODI

లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. రెండో వన్డేలో భారత జట్టు వంద పరుగుల తేడాతో ఓడిపోయింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. 247 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన టీమిండియా 146 పరుగులు చేసి ఆలౌటైంది.  ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (9), వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి (16), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (0) కూడా నిరాశ పరిచారు. నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు సూర్యకుమార్ యాదవ్(27), జడేజా (29), హర్ధిక్ పాండ్యా(29), షమీ (23) పరుగులు చేయడంతో చెప్పుకోదగిన స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్లే ఆరు వికెట్లు పడగొట్టగా డెవిడ్ విల్లీ, కార్సే, మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ తలో ఒక వికెట్ తీశారు. దీంతో 1-1 సిరీస్ తో సమజ్జీవులుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News