Monday, December 23, 2024

చెత్త ఆటతో పరువు తీశారు..

- Advertisement -
- Advertisement -

ఐసిసి టోర్నీల్లో తీరుమారని టీమిండియా

మన తెలంగాణ/క్రీడా విభాగం : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం చవిచూడడాన్ని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండి యా ఐసిసి ట్రోఫీలకు వచ్చే సరికి పేలవమై న ఆటతో నిరాశ పరుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టి20 వరల్డ్‌కప్‌లతో పాటు రెండు వన్డే వరల్డ్‌కప్‌లలో కూడా భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఇక ప్రతిష్టాత్మకమైన టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించినా రెండు సార్లు కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ప్రధాన టోర్నమెంట్‌ల లో భారత ఆటగాళ్లు పూర్తిగా తేలిపోతున్నా రు. ఐపిఎల్ వంటి కాసులు కురిపించే టోర్నీలో పరుగుల వరద పారించే ఆటగాళ్లు టీమిండియాకు వచ్చే సరికి పూర్తిగా విఫలమవుతున్నారు. ఐపిఎల్‌లో అదరగొట్టిన గిల్ డబ్లూటిసి ఫైనల్లో మాత్రం రాణించలేక పోయాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇక సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఔటైన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో కాస్త బాగానే ఆడాడు. అయితే చివరి రోజు జట్టుకు అండగా నిలుస్తాడని భావిస్తే ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు.

Also Read: మరో ఐదేళ్లు కష్టపడితే అన్నింటా మనమే టాప్

తేలిపోయిన నయా వాల్..

మరోవైపు డబ్లూటిసి ఫైనల్లో అదరగొడుతాడని భావించిన నయా వాల్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా ఘోరంగా విఫలమయ్యాడు. కౌంటీ క్రికెట్‌లో అద్భుతంగా రాణి ంచడంతో ఫైనల్లో అతనిపై జట్టు భారీ ఆశ లు పెట్టుకుంది. కానీ పుజారా మాత్రం రెండు ఇన్నింగ్స్‌లలో పూర్తిగా చేతులెత్తేసా డు. పేలవమైన బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశకు గురి చేశాడు. రహానె, శార్దూల్ తొలి ఇన్నింగ్స్‌లో బాగానే ఆడారు. మొదటి ఇన్నింగ్స్‌లో రాణించిన శార్దూల్, జడేజాలు రెండో ఇన్నింగ్స్‌లో ఆ స్థాయి బ్యాటింగ్‌ను కనబరచలేక పోయారు.

నిరాశే మిగిల్చాడు..

మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ డబ్లూటిసి ఫైనల్లోఘోరంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించలేక పోయాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. తొలి రోజు రోహిత్ సారథ్య వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రారంభంలోనే వికెట్లు తీసినా ప్రత్యర్థి జట్టు బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాడు. బౌలర్లను సమయోచితంగా వాడుకోవడంలో రోహిత్ తేలిపోయాడు. బ్యాటర్‌గా కూడా అతను అంతంత మాత్రంగానే రాణించాడు. ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలు కావడంతో ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తాయి. బౌలర్లు కాస్త బాగానే రాణించినా బ్యాటర్ల వైఫల్యంతో టీమిండియాకు అవమానకర ఓటమి తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News