Thursday, December 12, 2024

ఫైనల్లో యువ భారత్

- Advertisement -
- Advertisement -

షార్జా: అండర్19 ఆసియా కప్‌లో యువ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక యు వ జట్టు 46.2 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 21.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పో యి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అయూష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే అరంభాన్ని అందించారు. మాత్రే 28 బంతుల్లో ఏడు ఫోర్లతో 34 పరుగులు చేశాడు.

ఇక విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన వైభవ్ 36 బంతుల్లోనే 67 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐదు సిక్సర్లు, మరో ఆరు ఫోర్లు బాదేశాడు. సిద్ధార్థ్ (22), కెప్టెన్ అమాన్ 25 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు.

సమష్టిగా రాణించిన భారత బౌలర్లు లంకను 173 పరుగులకే పరిమితం చేశారు. లంక టీమ్‌లో లక్విన్ అబెసింఘే ఒక్కడే రాణించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన లక్విన్ 110 బంతుల్లో 69 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ షరుజన్ (42) పరుగులు సాధించాడు. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో చేతన్ శర్మ మూడు, కిరణ్, మాత్రే రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News