Thursday, January 23, 2025

పాకిస్తాన్ ప్రపంచ రికార్డును సమం చేసిన భారత్..

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ లో యువ భారత్ అదరగోడుతోంది. తొలి రెండు టీ20లో ఆసీస్ ను ఓడించి 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈక్రమంలో భారత్, పాకిస్తాన్ ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ అత్యధికంగా 135 మ్యాచ్ లో గెలిచి అగ్రస్థానంలో ఉంది.

తాజాగా ఆస్ట్రేలియా జరిగిన రెండో టీ20లో విజయం సాధించడంతో టీమిండియా కూడా 135 మ్యాచ్ లు గెలుపొంది పాకిస్తాన్ తో సమంగా నిలించింది. ఆసీస్ జట్టుతో జరుగనున్న మరో మూడు టీ20లో ఒకటి గెలిచినా భారత్ ప్రపంచరికార్డును నెలకొల్పుతుంది. 2006 నుంచి ఇప్పటివరకూ 226 టీ20 మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్ 135 గెలువగా.. భారత్ 211 టీ20 మ్యాచ్ లోనే ఈ రికార్డు సాధించింది. తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్102 విజ‌యాల‌ు), ద‌క్షిణాఫ్రికా(95), ఆస్ట్రేలియా(94)లు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News