Sunday, December 22, 2024

టీమిండియాకు ఏమైంది?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచంలోనే బలమైన జట్టుగా పేరు తెచ్చుకున్న సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేలవమైన ఆటతో తేలిపోతోంది. ఇప్పటికే బెంగళూరులో జరిగిన మొదటి టె స్టులో భారత్ చిత్తుగా ఓడింది. తాజాగా పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ ఓటమి బాటలో ప్రయాణిస్తోంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పించు కోవడం టీమిండియాకు అసాధ్యమేనని చెప్పాలి. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక పుణెలో కూడా పేలవమైన బ్యాటింగ్ టీమిండియాకు శాపంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా స్టార్ బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు.

రోహిత్ ఖాతా తెరవకుండానే పెవిలియ న్ చేరగా, కోహ్లి ఒక పరుగు మాత్రమే చేశాడు. ఇక రెండో టెస్టులో అద్భు త సెంచరీతో అలరించిన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా 11 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. భారీ ఆశలు పెట్టుకున్న శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్‌లు కూడా విఫలమయ్యారు. అశ్విన్ మరోసారి చెత్త బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఇలా కీలక బ్యాటర్లందరూ విఫ లం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 156 పరుగులకే కుప్పకూలింది. సొంత గడ్డపై భారత్‌ను కట్టడి చేయడం పెద్ద పెద్ద జట్ల బౌలర్లకే కష్టంగా ఉండేది. అలాంటిది కివీస్ బౌలర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్లు పూ ర్తిగా తేలిపోవడం బాధకు గురి చేసే అంశమే. ఇప్పటికైనా జట్టు యాజమా న్యం ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News