లీడ్స్: మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు బాగానే బౌలిం గ్ చేశారని ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మన్ డేవిడ్ మలాన్ పేర్కొన్నాడు. పిచ్ నుంచి సహకారం లభించక పోవడం తో భారత బౌలర్లు వికెట్లను పడగొట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇక తొలి రోజు పిచ్ బౌలర్లకు సహకరించిందన్నాడు. దీంతో తమ బౌలర్లు అద్భుతంగా రాణించగలిగారన్నాడు. అయితే టివిరామం తర్వాత పించ్ మందకొడిగా మారిందన్నాడు. దీంతో పరుగులు సులువుగా లభించాయన్నాడు. ఇక పిచ్ నుంచి సహకా రం లభించకున్నా టీమిండియా బౌలర్లు బాగానే బౌలిం గ్ చేశారన్నాడు. కొన్ని సార్లు వారి బంతులను ఎదుర్కొనేందుకు తమ బ్యాట్స్మన్ చాలా ఇబ్బందులు పడ్డ విషయాన్ని మలాన్ గుర్తు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో రూట్ బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ రూట్ సాధించిన శతకం చిరస్మరణీయమన్నాడు. ఇక ఈ మ్యాచ్లో తమ కు గెలుపు అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయన్నాడు. అయితే టీమిండియా కూడా మ్యాచ్ను డ్రాగా ముగించేందుకు తీవ్రంగా శ్రమించడం ఖాయమన్నాడు. దీంతో ఆట చివరి రోజు వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదని మలాన్ పేర్కొన్నాడు.
బాగానే బౌలింగ్ చేశారు : డేవిడ్ మలాన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -