Monday, December 23, 2024

హాకీలో అదరగొట్టిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

సింగపూర్‌పై 161తో ఘన విజయం
హాంగ్‌జౌ: ఆసియా క్రీడల హాకీలో భారత పురుషుల జట్టు మరో భారీ విజయం నమోదు చేసింది. మంగళవారం పూల్‌ఎలో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 161 తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో టీమిండియా 160 తేడాతో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇక సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

స్టార్ ఆటగాడు మన్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. మన్‌దీప్ (12, 30, 51) నిమిషాల్లో గోల్స్ సాధించాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఏకంగా నాలుగు గోల్స్ సాధించడం విశేషం. 24. 39, 40, 42 నిమిషాల్లో హర్మన్‌ప్రీత్ గోల్స్ చేశాడు. మిగతా వారిలో అభిషేక్, వరుణ్ కుమార్ రెండేసి గోల్స్ సాధించారు. ఇక గుర్జంత్ సింగ్, వివేక్ సాగర్, షంషేర్ సింగ్, లలిత్ కుమార్, మణ్‌ప్రీత్ సింగ్‌లు ఒక్కో గోల్‌ను నమోదు చేశారు. సింగపూర్ తరఫున ఏకైక గోల్‌ను జుల్కర్‌నైన్ సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News