Sunday, January 19, 2025

చివరి రెండు టి20ల కోసం అమెరికాకు టీమిండియా..

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో జరిగే చివరి రెండు టి20 మ్యాచ్‌ల కోసం టీమిండియా అమెరికా చేరుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే విండీస్‌లో మూడు టి20లో జరిగాయి. మిగిలిన రెండు టి20లకు అమెరికాలోని ఫ్లోరిడా నగరం ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లను ఆడేందుకు భారత్ జట్టు ఇక్కడికి చేరుకుంది.

శని, ఆదివారాల్లో ఈ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక వెస్టిండీస్ కూడా ఫ్లోరిడా చేరింది. గతంలో కూడా భారత్ ఫ్లోరిడాలో టి20 మ్యాచ్‌లను ఆడింది. అన్ని మ్యాచ్‌లు కూడా విండీస్‌తోనే జరిగాయి. ఈసారి కూడా విండీస్‌తోనే తలపడనుంది. ఇక సిరీస్‌లో వెస్టిండీస్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News