Tuesday, January 28, 2025

ఆస్ట్రేలియాకు రోహిత్ సేన!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియా ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు పయానమైంది. టి20 ప్రపంచకప్‌కు అక్టోబర్ 16న తెరలేవనుంది. కాగా, సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌ను ముగించిన టీమిండియా వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరింది. రోహిత్ నేతృత్వంలోని భారత్ ఈ ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో బాగానే ఉన్నా బౌలింగ్ సమస్య జట్టును వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు ప్రపంచకప్‌కు దూరమయ్యారు. మరో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు బౌలింగ్ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Team India landed in Australia for T20 World Cup

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News