Sunday, December 22, 2024

శ్రేయస్ ఔట్… టీమిండియా 377/7

- Advertisement -
- Advertisement -

చట్టోగ్రామ్: జహుర్ అహ్మాద్ చౌదరీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 128 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 377 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శ్రేయస్ అయ్యర్ 192 బంతుల్లో 86 పరుగులు చేసి ఏడో వికెట్ రూపంలో ఔటయ్యాడు. రవి చంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఎనిమిదో వికెట్‌పై అశ్విన్- కులదీప్ యాదవ్ 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో అశ్విన్ (57), కుల్దీప్ యాదవ్ (33) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ మూడు వికెట్లు పడగొట్టగా మెహిడీ హసన్ మిరాజ్ రెండు వికెట్లు, ఇబడాట్ హోస్సేన్, ఖలీద్ అహ్మాద్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News