Friday, December 27, 2024

తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్…. టీమిండియా 380/9

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 133 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 380 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికే భారత జట్టు 203 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా 70 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మహ్మాద్ షమీ 37 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్‌లో కారేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ ఏడు వికెట్లు పడగొట్టగా కమ్నీస్, నాథన్ లయన్ చెరో ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో అక్షర పటేల్ (70), సిరాజ్ (0) పరుగులు చేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసి ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News