Thursday, December 26, 2024

45 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

 

ఇండోర్: హోల్కర్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు భారత జట్టు 11.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 45 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్లు భారత జట్టు వెన్నువిరిచారు. నాథన్ లయాన్ రెండు వికెట్లు, కుహ్నెనాన్ మూడు వికెట్లు తీయడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ 12 పరుగులు చేసి కుహ్నెమన్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకు స్టంపౌట్ చేశాడు. శుభమన్ గిల్ 21 పరుగులు చేసి కుహ్నెమన్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఛటేశ్వర్ పూజారా ఒక పరుగు చేసి లయాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రవీంద్ర జడేజా నాలుగు పరుగులు చేసి లయాన్ బౌలింగ్‌లో కుహ్నెనాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ జీరో పరుగులు చేసి కుహ్నేమాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ కావడంతో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(07), శ్రీకర్ భరత్(00) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News