పెర్త్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 120 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 388 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు టీమిండియా 434 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగగా, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసి పర్వాలేదనిపించారు. భారత బ్యాట్స్‌మెన్లు యశస్వి జైస్వాల్(161), కెఎల్ రాహుల్(77), దేవ్‌దూల్ పడిక్కల్(25), రిషబ్ పంత్(01), ధ్రువ్ జురెల్(01) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(54), వాషింగ్టన్ సుందర్(20) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, జోష్ హజిల్‌వుడ్, ప్యాట్ కమ్నీస్, మిచెల్ మార్ష్, నాథన్ లయన్ తలో ఒక వికెట్ తీశారు.
టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 150
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 104