Sunday, January 19, 2025

అయ్యర్, సూర్యా ఔట్…134/5

- Advertisement -
- Advertisement -

క్రైస్ట్‌చర్చ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో టీమిండియా 29 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 134 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఐదు వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. సూర్యాకుమార్ యాదవ్ ఆరు పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి నాల్గో వికెట్ రూపంలో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో కూడా సూర్యాకుమార్ యాదవ్ తీవ్ర నిరాశ పరిచాడు. శ్రేయస్ అయ్యర్ 49 పరుగులు చేసి పరుగుజన్ బౌలింగ్‌లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.

శుభ్‌మన్ గిల్ 13 పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో శాంట్నార్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. శిఖర్ ధావన్ 28 పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కీపర్ రిషబ్ పంత్ పది పరుగులు చేసి డార్లీ మిచెల్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలీప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో దీపక్ హుడా(03), వాషింగ్టన్ సుందర్(08) బ్యాటింగ్ చేస్తున్నారు. కవీస్ బౌలర్లలో అడమ్ మిల్నే మూడు వికెట్లు తీయగా పరుగుజన్, డార్లీ మిచెల్ చెరో ఒక వికెట్ తీశారు. తొలి వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News