Sunday, December 22, 2024

పంత్, గిల్ సెంచరీ… టీమిండియా 263/4

- Advertisement -
- Advertisement -

చెన్నై: చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 61 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 263 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 490 పరుగుల ఆధిక్యంలో ఉంది. రిషభ్ పంత్, శుభ్ మన్ గిల్  సెంచరీలతో చెలరేగారు. పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేసి హసన్ మిరాజ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. నాలుగో వికెట్‌పై ఇద్దరు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(106), కెఎల్ రాహుల్(11) బ్యాటింగ్ చేస్తున్నారు. బంగ్లా బౌలర్లలో హసన్ మిరాజ్ రెండు వికెట్లు, టస్కిన్ అహ్మద్, నహిద్ రానా, మెహిడీ చెరో ఒక వికెట్ తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News