సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 85 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బోలాండ్ మూడు వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచాడు. ప్రస్తుతం భారత జట్టు 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెఎల్ రాహుల్ 13 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. విరాట్ కోహ్లీ ఆరు పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. గిల్ 13 పరుగులు చేసి వెబ్ స్టర్ బౌలింగ్ లో అలెక్స్ కారేకు క్యాచ్ వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (21), రవీంద్ర జడేజా(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
#ViratKohli𓃵 is absolutely shameless he will never retire and suck up the place of a talented player despite knowing how he's letting down India repeatedly. This guy needs to be thrown out from the team. #INDvsAUSTest #INDVSAUS #ViratKohlipic.twitter.com/O3VJVoqEAr
— Ganesh (@me_ganesh14) January 4, 2025
Virat kohli dismissal nowadays is same as when we found the glitch in game and get the NPC out again & again#Kohli #INDVSAUS #BGT pic.twitter.com/A8SgLMFejS
— Dhruv deshmukh (@Dhruvdeshmukh13) January 4, 2025