Monday, December 23, 2024

నాల్గో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా జింబాబ్వే-ఇండియా జరుగుతున్న మ్యాచ్‌లో 14 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 103 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రాహుల్ 35 బంతుల్లో 51 పరుగులు చేసి సికిందర్ రాజా బౌలింగ్ లో మసకద్జకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో 15 పరుగులు చేసి ముజరబని బౌలింగ్‌లో మసకద్జకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 26 పరుగులు చేసి సీన్ విలియమ్సన్ బౌలింగ్ లో రైన్ బర్ల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  రిషభ్ పంత్ మూడు పరుగులు చేసి సీన్ విలియమ్సన్ బౌలింగ్ లో రైన్ బర్ల్ కు క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం క్రీజులో హర్ధిక్ పాండ్యా(03), సూర్యాకుమార్ యాదవ్(05) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News