Monday, November 18, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్ మూడో రోజు భారత జట్టు 34 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 129 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ 29 పరుగులు చేసి టామ్ హార్ట్‌లే బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రజత్ పాటీదర్ తొమ్మిది పరుగులు రెహాన్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్ రూపంలో మైదానం వీడాడు. భారత్ బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్(17), రోహిత్ శర్మ(13) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(59), అక్షర్ పటేల్(02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో జేమ్స్ అండర్‌సన్ రెండు వికెట్లు, రెహాన్ అహ్మాద్, టామ్ హార్ట్‌లే చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News