Friday, January 24, 2025

84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

 

ఇండోర్: హోల్కర్ స్టేడియలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 26 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 84 పరుగులతో బ్యాటింగ్ కొనిసాగిస్తోంది. మథ్యూ కుహ్నెమాన్, నాథన్ లయాన్ భారత్ జట్టు వెనువిరిచారు. మాథ్యూ, లయాన్ బౌలింగ్ ధాటికి భారత్ బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. విరాట్ కోహ్లీ(22), రోహిత్ శర్మ(12), శుభ్‌మన్ గిల్(21), శ్రీకర్ భరత్ (17), రవీంద్ర జడేజా(06), ఛటేశ్వరా పుజారా(01) పరుగులు చేసి ఔటయ్యారు. శ్రేయస్ అయ్యర్ జీరో పరుగులు డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్ (06), రవీచంద్రన్ అశ్విన్ (01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాథ్యూ కుహ్నేనాన్, నాథన్ లయాన్ చెరో మూడు వికెట్లు, టడ్ మర్ఫీ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News