Thursday, December 19, 2024

జడేజా ఔట్…. టీమిండియా 352/7

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 98 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెండో రోజు కుల్దీప్ యాదవ్ నాలుగు పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. వెంటనే రవీంద్ర జడేజా 112 పరుగులు చేసి జోయ్ రూట్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్(10), రవిచంద్రన్ అశ్విన్(11) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు తీయగా జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లే, జోయ్ రూట్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News