Wednesday, January 22, 2025

ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 38 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ జట్టు 152 పరుగుల ఆధిక్యంలో ఉంది. 107 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. శుభ్‌మన్ గిల్ 30 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. శాంట్నర్ బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీ కూడా క్లీన్ బౌల్డయ్యాడు. యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేసి గ్లెన్ ఫిలీప్స్ బౌలింగ్‌లో డారీ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.

రిషబ్ పంత్ 18 పరుగులు చేసి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ 11 పరుగులు చేసి శాంట్నార్ బౌలింగ్‌లో విలియమ్ రూర్కీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. రవిచంద్రన్ అశ్విన్ నాలుగు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(11), వాషింగ్టన్ సుందర్ (02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 259 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News