Saturday, January 18, 2025

ఆరో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 64 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్ సెంచరీతో విజృంభించాడు. ఇప్పటి వరకు భారత జట్టు 370 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ 147 బంతుల్లో 104 పరుగులు చేసి షోయిబ్ బషీర్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్షర పటేల్ 45 పరుగులు చేసి టామ్ హార్ట్‌లే బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ఇప్పటికే భారత జట్టు 370 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాట్స్‌మెన్లలో గిల్ (104), అక్షర పటేల్(45), శ్రేయస్ అయ్యర్(29), యశస్వి జైస్వాల్(17), రోహిత్ శర్మ(13), రజత్ పాటీదర్(09) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శ్రీకర్ భరత్(02), రవిచంద్రన్ అశ్విన్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లే చెరో రెండు వికెట్లు తీయగా షోయబ్ బషీర్, రెహాన్ అహ్మాద్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News