Sunday, December 22, 2024

34 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు 24 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 34 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. నలుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ రూపంలో వెనుదిరిగడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ రెండు పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా విలియమ్ రూర్కీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలీప్స్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.

సర్ఫరాజ్ ఖాన్ పరుగులు లేమీ చేయకుండా మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేసి విలియమ్ రూర్కీ బౌలింగ్‌లో అజాజ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెఎల్ రాహుల్ డకౌట్ రూపంలో విలియమ్ రూర్కీ బౌలింగ్‌లో ఫెవిలియన్‌కు చేరాడు. రవీంద్ర జడేజా మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో అజాజ్ పటేల్ కు క్యాచ్ డకౌట్ రూపంలో ఔటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ రూర్కీ మూడు వికెట్లు తీయగా మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు, టిమ్ సౌతీ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News