- Advertisement -
హరారే: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేధికంగా భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి ట్వి20 మ్యాచ్‌లో టీమిండియా 11 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 53 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జింబాబ్వే 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ, రింకు సింగ్ డకౌట్ వెనుదిరిగడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్(7), రియాన్ పరాగ్(02) పరుగులు చేయడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ధ్రువ్ జురెల్ ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(01), రవి బిష్ణోయ్(05) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. జింబాబ్వే బౌలర్లలో తెండాయ్ చతారా రెండు వికెట్లు తీయగా బ్రియన్ బెన్నెట్, బ్లెసింగ్ ముజరబానీ చెరో ఒక వికెట్ తీశారు.
- Advertisement -