- Advertisement -
కటక్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 23 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఇంకా 133 పరుగులు చేస్తే టీమిండియా గెలుస్తుంది. శుబ్‌మన్ గిల్ 60 పరుగులు చేసి జమీ ఓవర్టన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఓపెనర్లు రోహిత్-గిల్ 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కోహ్లీ ఐదు పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
- Advertisement -