Sunday, December 22, 2024

రోహిత్, కోహ్లీని తప్పించాల్సిందే.. అభిమానులు ఫైర్

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. తొలి టెస్టులో ఘోర పజాయం చవిచూసిన భారత్ తాజాగా రెండో టెస్టులోనూ ఓడి సిరీస్‌ను సమర్పించుకోవడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత్ అవమానకర ఓటమికి రోహిత్ శర్మ పేలవమైన కెప్టెన్సీనే కారణమని దుమ్మెత్తి పోస్తున్నారు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడని, అతనితో పాటు కోహ్లిని కూడా జట్టు నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సొంత గడ్డపై భారత్ ఇలాంటి ప్రదర్శన చేయడాన్ని వారు తట్టుకోలేక పోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News