Wednesday, January 8, 2025

టీమిండియా ముమ్మర సాధన

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ముమ్మర సాధన చేస్తోంది. డేనైట్ పద్ధతిలో ఈ మ్యాచ్ జరుగనుంది. బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీ ఐదు మ్యాచ్‌ల టె స్టు సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించి సిరీస్‌లో 10 ఆధిక్యం లో నిలిచింది.

మొదటి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ లేకుండానే బరిలోకి దిగిన భా రత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఇక పింక్ బాల్ టెస్టులో భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చారు. దీంతో భారత జట్టు ఆత్మ వి శ్వాసం మరింత పెరింది. డేనైట్ మ్యాచ్ కోసం టీమిండి యా ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు.

కొన్ని రోజులు గా భారత క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీ నియర్లు రోహిత్, బుమ్రా, కోహ్లి, అశ్విన్, జడేజా, కుల్దీప్, రాహుల్ తదితరులతో పాటు యువ ఆటగాళ్లు కూడా సా ధనలో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాతో పోల్చితే డేనైట్ టెస్టు మ్యాచుల్లో ఆడిన అనుభవం టీమిండియాకు తక్కు వగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లు నెట్స్‌లో గంటల తరబడి సాధన చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News